ఈ ఆలయాలు సందర్శిస్తే శని అనుగ్రహిస్తాడట..

ఈ ఆలయాలు సందర్శిస్తే శని అనుగ్రహిస్తాడట..

ఈ ఆలయాలు సందర్శిస్తే శని అనుగ్రహిస్తాడట..

వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్: కొంతమంది వారి జీవితంలో ఎంతకష్టపడి పనిచేసినా ఇంకా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. శనిదోషం వల్లే ఇలా జరుగుతుందని నమ్ముతారు. ఒక వ్యక్తి చేసిన కర్మలను అనుసరించి శని కొందరికి శుభాలను కలిగిస్తాడు. మరికొందరికి కష్ట, నష్టాలను కలిగిస్తాడు. శని దేవుని ఆగ్రహం వల్ల కొంతమంది జీవితాల్లో ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. శనిదేవుడి ఆగ్రహం నుంచి విముక్తి పొందాలంటే మన దేశంలో కొన్ని అద్భుతమైన శని దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను సందర్శించిన వ్యక్తి శని దోషం నుండి విముక్తి పొందుతాడు.

1.సారంగపూర్ కాష్టభంజన హనుమాన్ ఆలయం :
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని సారంగపూర్‌లో హనుమంతుని పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కాష్ఠభంజనం అంటారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో శని దేవుడితో పాటు హనుమంతుని విగ్రహం ప్రతిష్టించబడి ఉంది. ఈ ఆలయంలో శనిదేవుడు స్త్రీ రూపంలో హనుమంతుని పాదాల చెంత కూర్చుని ఉంటాడు. ఎవరి జాతకంలో శనిదోషం ఉంటే ఈ గుడిలో హనుమంతుడిని పూజించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి.

2.ఉజ్జయిని శని మందిరం :
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శనిదేవుని పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే శని దోషాలను తొలగిపోతాయి. ఈ ఆలయంలో, శని దేవుని విగ్రహం బహిరంగంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ గ్రామంలోని ఏ ఇంటికీ తలుపులు ఉండవు. శని దేవున్ని దర్శించుకోవడం ద్వారా అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది.

3.శని మందిర్, ఇండోర్ :
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న ఈ శనిదేవుని ఆలయం చాలా ముఖ్యమైనది. ఇండోర్‌లోని జూ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో శనిదేవునికి 16 అలంకరణలు చేశారు. ఈ ఆలయం నల్లరాళ్లతో నిర్మించి ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించిన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.

4.శనిశ్చర దేవాలయం గ్వాలియర్ :
గ్వాలియర్‌లోని ఈ శని దేవాలయం చాలా పురాతనమైనది. హనుమంతుడు శనిదేవుని దేహాన్ని లంక నుండి ఇక్కడకు విసిరివేసినట్లు ప్రతీతి. ఆ తర్వాత ఇక్కడ శనిదేవుని ఆలయాన్ని స్థాపించారు.ఇక్కడ శని దేవుడిని పూజించిన తరువాత, ఆవనూనె లేదా నువ్వుల నూనెను ఆయనకు నైవేద్యంగా పెడతారు. దీని తర్వాత మన కష్టాలను శని దేవుడికి చెప్పుకోవాలి. లా చేయడం వల్ల శని దేవుడు ఆ వ్యక్తికి ఉన్న అన్ని సమస్యలను దూరం చేస్తాడని నమ్ముతుంటారు.