వాగులో పడిన బస్సు.. 8 మంది మృతి

వాగులో పడిన బస్సు.. 8 మంది మృతి
పశ్చిమగోదావరి జిల్లా : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు వాగులో పడటంతో 8 మంది దుర్మరణంపాలయ్యారు. జంగారెడ్డి గూడెం, జిల్లేరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. వంతెన రెయిలింగ్ ను బస్సు ఢీకొట్టడంతో అదుపు తప్పి వాగులో పడిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మిగతా ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. వేలేరుపాడు నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన సమయంలో ఈ బస్సులో 40 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. మరణించిన 8 మందిలో ఐదుగురు మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. పడవల సాయంతో బస్సులోని వాళ్లను స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు.