భద్రకాళి సన్నిధిలో దాస్యం, పాపారావు
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని ప్రభుత్వ సలహాదారులు,రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి పాపారావు , కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు సందర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు ఆలయాన్ని సందర్శించి, భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయానికి వచ్చిన వీరికి ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఆలయ నిర్వహకులు పూర్ణ కుంభం, మేళతాళాలతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి, వేద ఆశీర్వచనాలు అందించారు. హనుమకొండలో ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం విచ్చేసిన ప్రభుత్వ సలహాదారులు, రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి పాపారావు, చీఫ్ విప్ తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరి వెంట కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, తదితరులు ఉన్నారు.