పరకాలలో బీఆర్‌ఎస్‌లో చేరికల జోరు
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో చేరికల జోరు కొనసాగుతోంది. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో గులాబీ దళంలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే చల్లా తెలిపారు. గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు.గతంతో పోలిస్తే గ్రామాల్లో అభివృద్ది కళ్ల ముందే కనిపిస్తుందన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రతీ కార్యకర్త తిప్పికొట్టాలని సూచించారు. పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పల కాపాడుకుంటానని చల్లా ధర్మారెడ్డి అన్నారు.
పార్టీలో చేరిన వారిలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొమ్మిడి మోహన్ రెడ్డి, కంది నర్సింహ రెడ్డి, జిల్లా యూత్ నాయకులు వంచ రవీందర్ రెడ్డి, వార్డ్ మెంబర్ బన్నాల బిక్షపతి, నాయకులు ఎండి ఘనిబ్, కంది వెంకన్నలతో పాటు 25మంది యువకులు చేరారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.