పేపర్ కొనడానికి డబ్బుల్లేక అక్కడ పరీక్షలు రద్దు
వరంగల్ టైమ్స్, కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రస్థాయికి చేరింది. బడుల్లో పరీక్షలు నిర్వహించడానికి కనీసం పేపర్, ఇంక్ ను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితికి శ్రీలంక దిగజారింది. పేపర్ కొరత కారణంగా శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్ లో పరీక్షలను నిరవధికంగా రద్దు చేశారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వలు నిండుకోవడంతో ప్రస్తుతం ఆ దేశం అప్పులతో నెట్టుకువస్తుంది.