జైలులో డీఆర్డీవో సైన్టిస్ట్ సూసైడ్ అటెంప్ట్

జైలులో డీఆర్డీవో సైన్టిస్ట్ సూసైడ్ అటెంప్ట్న్యూఢిల్లీ : డీఆర్డీవో శాస్త్రవేత్త భరత్ భూషణ్ కటారియా జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఐఈడీ పేలుడుకు పాల్పడిన కేసులో డీఆర్డీవో శాస్త్రవేత్త (47 ఏళ్లు) భరత్ భూషణ్ కటారియాను ఇటీవల క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అమిత్ వాశిష్ట్ అనే లాయర్ ను కోర్టు రూంలో టార్గెట్ చేస్తూ ఐఈడీని పేల్చిన కేసులో కటారియాను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఆ వ్యక్తి జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. వాంతులు, కడుపునొప్పి వస్తున్నట్లు చెప్పడంతో కటారియాను హాస్పిటల్ లో చేర్పించారు.పోలీస్ కస్టడీలో ఉన్న అతను సూసైడ్ చేసుకొని చావాలనుకున్నట్లు తెలుస్తోంది. కటారియా లిక్విడ్ హ్యాండ్ వాష్ ను తాగినట్లు వైద్యులు తెలిపారు. ఐతే ప్రస్తుతం అతను అబ్జర్వేషన్ లో ఉన్నాడని, అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రెండ్రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అతన్ని తరలించారు. ఎయిమ్స్ లో చేర్పించారు.