వరంగల్ తూర్పులో ఈటెల టూర్ 

వరంగల్ తూర్పులో ఈటెల టూర్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : సీఎం కేసీఆర్ దోపిడీ పాలనను ఆపగలిగే శక్తి ప్రజలకే ఉందని బీజేపీ వరంగల్ తూర్పు నియోజకవర్గ పాలక్, మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మూడు రోజుల వరంగల్ తూర్పు నియోజకవర్గ పర్యటనలో భాగంగా శుక్రవారం నగరంలోని ఆర్టీఏ జంక్షన్ వద్ద బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు , ఈటెలకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రంగశాయిపేటకు చెందిన ఉద్యమకారుడు, సాంస్కృతిక వేత్త, బీజేపీ నాయకుడు కొల్లూరి యోగానంద్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా నెహ్రూ జంక్షన్ చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు.వరంగల్ తూర్పులో ఈటెల టూర్ ఆ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ తనకు వరంగల్ తూర్పు నియోజకవర్గం బాధ్యతను అప్పగించిందని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఇంటింటికి బీజేపీని తీసుకెళ్లే పనిమీద వచ్చానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మగౌరవం నిలిపే విధంగా భారత ప్రధానిగా కొనసాగుతున్నారని కొనియాడారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ను నమ్మి రెండు సార్లు ఓట్లు వేశామని, ఇప్పుడు కళ్లు నెత్తికి ఎక్కి జనాలను మరిచిపోయి చక్రవర్తిలాగా, రాజులాగా పరిపాలిస్తున్నాడని ఈటెల మండిపడ్డారు.

ఈ ర్యాలీలో మహిళలు ఈటెల రాజేందర్ కు, ఎర్రబెల్లి ప్రదీప్ రావులకు బొట్టు పెట్టి, హారతులు ఇచ్చి బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. ర్యాలీలో భాగంగా డప్పుచప్పుళ్లతో కళాకారులు విన్యాసాలు వేయగా, మహిళలు కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. పలువురు యువత ఈటెలతో సెల్పీలు దిగారు. తెలంగాణ ఉద్యమకారుడు బీజేపీ నాయకుడు కొల్లూరి యోగానంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, బీజేపీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజయ్య యాదవ్, కుసుమ సతీష్, అచ్చ విద్యాసాగర్, అశోక్ రెడ్డి, సమ్మిరెడ్డి, జలగం రంజిత్, మండల సురేష్, అంకాల జనార్ధన్, పరమేశ్వర్, మోహనాచారి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.