తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ 

తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీతొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ 

warangaltimes, స్పోర్ట్స్ డెస్క్ : టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన టీం ఇండియా అదే ఊపు వన్డే సిరీస్ లోనూ కొనసాగించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత ఆసీస్ ను 188 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా మరో 10 ఓవర్లు ఉండగానే మ్యాచ్ ముగించింది.

టెస్ట్ సిరీస్ లో విఫలమైన కేఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సహకారం అందించాడు. అజేయంగా నిలిచిన వీళ్లు ఆరో వికెట్ కు 103 రన్స్ జోడించారు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.