ఇంటర్ ప్రవేశాల గడువు ఈనెల 30 వరకు పొడిగింపు

హైదరాబాద్ : ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఓమర్ జలీల్ వెల్లడించారు. మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని పేర్కొన్నారు.

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ , ఎయిడెడ్ సహా అన్ని గురుకులాల్లో ప్రవేశాల గడువు బుధవారంతో ముగిసింది. తాజాగా ఈనెల 30 వరకు పొడిగించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రవేశాలు పొందని విద్యార్థులంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.