సీఎస్ ఎంపికలో కేసీఆర్ పక్కా స్కెచ్!!

సీఎస్ ఎంపికలో కేసీఆర్ పక్కా స్కెచ్!!సీఎస్ ఎంపికలో కేసీఆర్ పక్కా స్కెచ్!!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : పాత సీఎస్ సోమేశ్ కుమార్ పై తెలంగాణలోని ప్రతిపక్షాలంతా విమర్శలు ఎక్కుపెట్టడం.. ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనని ఆదేశాలు రావడం..ఆ తర్వాతి పరిణామాలతో సీఎం కేసీఆర్ కు ఆయనను తప్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్త సీఎస్ గా ఎవరికి అవకాశం ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. చివరకు కేసీఆర్ అందరి అంచనాలను తారుమారు చేసి, శాంతికుమారికి సీఎస్ గా ఛాన్స్ ఇచ్చారు. అయితే శాంతికుమారి ఎంపిక అంత ఈజీగా జరగలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. చాలా పకడ్బందీ వ్యూహంతో, పక్కా స్కెచ్ వేసి మరీ శాంతికుమారిని ఎంపిక చేసినట్లు టాక్.

పాత సీఎస్ సోమేశ్ కుమార్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేసినట్లుగా, కొత్త సీఎస్ పై విమర్శలు రాకుండా సీఎం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. రామకృష్ణారావు లాంటి వారు రేసులో ముందున్నప్పటికీ చివరకు సీనియర్ అధికారి, పాలనా వ్యవహారాలపై పట్టున్న శాంతికుమారికి కేసీఆర్ అవకాశమిచ్చారు.

శాంతికుమారి ఎంపిక వెనుక ముఖ్యంగా క్యాస్ట్ కోణం కూడా ఉందన్న ఊహాగానాలు వస్తున్నాయి. శాంతికుమారిది కాపు సామాజికవర్గం. పైగా ఏపీ. దీంతో అటు బీఆర్ఎస్ కోణంలోనూ ఆ సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకునే వ్యూహాన్ని కేసీఆర్ అమలుచేసినట్లు టాక్. అంతేకాదు శాంతికుమారి సీఎస్ గా పగ్గాలు చేపట్టారో లేదో వెంటనే తమిళనాడు మాజీ సీఎస్, జనసేన సలహాదారు, కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు అయిన రామ్మోహన్ రావులు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ తో ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు టాక్. ఈ భేటీలో ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ కూడా పాల్గొనడంతో శాంతికుమారి ఎంపిక వెనుక క్యాస్ట్ కోణం కూడా ఉండొచ్చన్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.సీఎస్ ఎంపికలో కేసీఆర్ పక్కా స్కెచ్!!తెలంగాణ కోణంలో చూసినా బీజేపీ నేతలు బండి సంజయ్, అర్వింద్ లాంటి వారి నోటికి చెక్ పెట్టేందుకు కాపు సామాజికవర్గానికి చెందిన శాంతికుమారికి కేసీఆర్ అవకాశమిచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణలో మున్నూరు కాపు సామాజికవర్గం- ఏపీలో కాపు సామాజికవర్గం దాదాపుగా ఒక్కటేనని భావిస్తారు. ఇలా కొత్త సీఎస్ పై బీజేపీ నేతలు విమర్శలు చేసే సాహసం చేయకుండా కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నింటికీ మించి శాంతికుమారి ఉన్నత విద్యావంతురాలైన మహిళ. అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారి. కాబట్టి సోమేశ్ కుమార్ లా ఈమెపై బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ విమర్శలు చేసే అవకాశం లేదు. అందుకే శాంతికుమారికి కేసీఆర్ ఛాన్స్ ఇచ్చినట్లు కూడా టాక్.

మొత్తంగా శాంతికుమారిని సీఎస్ గా ఎంపిక చేయడం ద్వారా కేసీఆర్ గట్టి ప్లానే వేశారని తెలుస్తోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయాల్లో మరెవ్వరూ సీఎస్ పేరు ఎత్తి, విమర్శలు చేసే ఛాన్స్ ఇవ్వకుండా పక్కా గ్రౌండ్ వర్క్ చేశారని టాక్. సీఎస్ అంశంలో సీఎం కేసీఆర్ పర్ ఫెక్ట్ ప్లాన్ వేసిన విధానం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరించిందని సమాచారం.