రోడ్డు ప్రమాదంలో 6గురు మృతి

మహబూబాబాద్​ జిల్లా : మహబూబాబాద్​ జిల్లాలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రకుంటతండాకు చెందిన ఒ కే కుటుంబానికి చెందిన వారు ఆటోలో గుంజేడు ముసలమ్మ దర్శనానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో గూడూరు మండలంలోని మర్రిమిట్ట శివారు వద్దకు రాగానే వీరి ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతుల వివరాలు
జాటోతు కళ్యాణి w/o కస్నా వయస్సు (48)
జాటోతు ప్రమీల d/o కస్నా వయస్సు( 23)
జాటోతుప్రదీప్​ s/o కస్నా వయస్సు( 25)
జాటోతు ప్రసాద్​ s/o లచ్చీరాం వయస్సు( 42)
జాటోతు దివ్య d/o ప్రసాద్​, వయస్సు( 19)
జాటోతు రాము s/o బిచ్చా వయస్సు( 33)