తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఏఏ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఏఏ సోదాలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఏఏ సోదాలు కలకలం రేపుతున్నాయి..మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్ఏఏ అధికారులు.హైదరాబాద్ లోని మాజీ మావోయిస్టు రవిశర్మ అనురాధ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో విరసం నేత కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.

మావోయిస్టు పార్టీ చర్చల ప్రతినిధిగా కొనసాగిన కళ్యాణ్ రావు ఇంట్లో ఎన్ఏఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక, విశాఖపట్నంలోని అనురాధ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.

అంతేకాదు,ఇటీవల కాలంలో మృతిచెందిన మావోయిస్టు టాప్ లీటర్ ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురణపై కూడా ఎన్ఏఏ ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడుగా పనిచేసి రవిశర్మ ఇటీవల కాలంలో లొంగిపోయారు. ఆయన నివాసంలో కూడా సోదాలు నిర్వహించడం చర్చగా మారింది.