రాష్ట్రంలో కొత్తగా 324 కరోనా కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,62,526 కి చేరింది. కొత్తగా 280 మంది బాధితులు డిశ్చార్జి అవ్వగా, వైరస్ తో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు 6,53,302 మంది బాధితులు కోలుకున్నారు.

మహమ్మారి బారినపడి 3,899 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,325 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60 శాతం, మరణాల రేటు 0.58 శాతం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

బుధవారం ఒక్కరోజు 73,323 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే 79 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఆ తర్వాత ఖమ్మంలో 24, కరీంనగర్ లో 22, నల్గొండలో 19, రంగారెడ్డిలో 18 మంది కరోనా పాజిటివ్ గా తేలారు.