పార్ట్ టైం అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్

పార్ట్ టైం అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్ హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని జిల్లా పీజీ కేంద్రాలలోని వివిధ విభాగాలలో పార్ట్ టైం అధ్యాపకుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ ( కెమిస్ట్రీ), ఎంఏ (ఎకనామిక్స్ ), ఎంఏ ( ఇంగ్లీష్ ), ఎంలిబ్ఐఎస్సీ, ఎమ్మెస్సీ ( మ్యాథమెటిక్స్ ) తదితర కోర్సులను బోధించేందుకు పార్ట్ టైం అధ్యాపకుల అవసరం ఉందన్నారు.

ఎంసీఏ, ఎంబీఏ విభాగాలలో 60 శాతం మార్కులతో పీజీ పాసై, మిగిలిన విభాగాలలో 55 శాతం మార్కులతో పీజీ పాసై, నెట్, సెట్, స్లెట్ పరీక్షల్లో అర్హత సాధించిగానీ, పీహెచ్ డీ అవార్డు అయిన వారు గానీ వీటికి అర్హులని వివరించారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 24లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.