పెద్దపులిని హత్యచేసిన వేటగాళ్లు అరెస్ట్

పెద్దపులిని హత్యచేసిన వేటగాళ్లు అరెస్ట్ములుగు జిల్లా : వేటగాళ్ల ఉచ్చులో పడి పెద్దపులి బలైంది. పెద్దపులి చర్మం, గోళ్లను విక్రయించే క్రమంలో నిందితులు పోలీసులకు చిక్కారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ , వరంగల్ రేంజ్ సీసీఎఫ్ఎస్ జే.ఆశ ఆధ్వర్యంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆగస్టు మొదటివారంలో ఛత్తీస్ గఢ్ అడవుల నుంచి వలస వచ్చిన 4యేండ్ల ఆడపులి కిన్నెరసాని, బయ్యారం అడవుల గుండా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల అడవుల్లోకి ప్రవేశించింది.

స్థానిక గొత్తికోయగూడెంలో నివాసం ఉండే గొత్తికోయలు మడవి నరేష్, మడవి ఇరమయ్య, మడకం ముకేశ్, మడవి దేవ, మడవి గంగయ్యలు వణ్యప్రాణులను వేటాడటానికి ఉచ్చును ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 21న ఆ ఉచ్చులో పెద్దపులి చిక్కుకొని మరణించింది.

ఈ క్రమంలోనే మరణించిన పెద్దపులి ఎముకలు, గోళ్లను నిందితులు ఛత్తీస్ గఢ్ లో విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం అందుకున్న తాడ్వాయి పోలీసులు అటవీశాఖ అధికారులతో కలిసి తనఖీలు ముమ్మరం చేశారు.

కాటాపూర్ క్రాస్ వద్ద కారును తనిఖీ చేయగా పులిగోరు లభ్యమైంది. వెంటనే నిందులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు అడవిలో దాచిపెట్టిన పులిచర్మం, ఎముకలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

పెద్దపులిని హత్యచేసిన వేటగాళ్లు అరెస్ట్