రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులుహైదరాబాద్ : టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరి పంటలు మీడియాకు చూపిస్తానని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. ఇందులో భాగంగా నేడు రైతులతో రచ్చబండ కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారు.

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు వెళ్లాల్సి ఉండగా అర్థరాత్రి నుండే రేవంత్ ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక మరో వైపు రచ్చబండ కార్యక్రమం నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.