ఈ నెల 25 వరకు రేషన్ తీసుకోవచ్చు..!

ఈ నెల 25 వరకు రేషన్ తీసుకోవచ్చు..!హైదరాబాద్ : తెలంగాణలో రేషన్ సరుకులను ఈనెల 25 వరకు తీసుకునే వెసులుబాటు కల్పించినట్టు పౌరసరఫరాల ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ మాచన రఘునందన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జనవరి 20 వరకే సరుకులు తీసుకునే అవకాశం ఉండే. అయితే వివిధ జిల్లాల అవసరార్థం జనవరి 25 వరకు పొడిగించినట్టు తెలిపారు. ఆహార భద్రత కార్డు ఉన్నలబ్ది దారులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల రేషన్ తీసకోని వారు ఈ సౌలభ్యాన్ని సద్వినియోగ పరచుకుని రేషన్ తీసుకోవాలని రఘునందన్ సూచించారు.