నేటి నుంచి బతుకమ్మ సంబురాలు షురూ

నేటి నుంచి బతుకమ్మ సంబురాలు షురూహైదరాబాద్ : తెలంగాణ మహిళలు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ నేటి నుంచి ప్రారంభం కానుంది. 9 రోజుల పాటు తీరొక్క రీతిలో పూలను పేర్చి, ఆట పాటలతో పండుగను జరుపుకుంటారు. తొలిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా పేర్కొంటారు. పూలతో చక్కగా బతుకమ్మను పేర్చి, తమలపాకులు ఉంచి, పసుపుతో తయారు చేసిన బతుకమ్మను దానిపై పెట్టి పూజలు చేస్తారు.