ఈనెల 25న త్రిసభ్య కమిటీ భేటీ 

ఈనెల 25న త్రిసభ్య కమిటీ భేటీ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాలకు సంబంధించి త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 25న జరుగనున్నది. గతంలో ఇంతకు ముందు ఒకసారి కమిటీ సమావేశం అయింది. తాజాగా జరిగే భేటీ రెండో సారి. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో భేటీ జరుగనున్నది.ఈనెల 25న త్రిసభ్య కమిటీ భేటీ 

ఈ సమావేశానికి తెలంగాణ తరపున ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ పాల్గొననున్నారు. తెలంగాణ, ఏపీ మధ్య విభజన అంశాలు, సమస్యలపై సమీక్షించనున్నారు. అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనచట్టం 9వ షెడ్యూల్ లోని సంస్థల విభజనపై చర్చించనున్నారు. సింగరేణితో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజనతో పాటు చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపై చర్చ జరిగే అవకాశం ఉన్నది.