ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
వరంగల్ టైమ్స్, ఆంధ్రప్రదేశ్ : ఏపీలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అధినాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు. దీనికోసం కసరత్తు చేసిన ఆ పార్టీ నాయకత్వం నేడు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మరోసారి సామాజిక న్యాయానికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేశారని సజ్జల అన్నారు.
మొత్తం 18 స్థానాల్లో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీ 1, ఓసీలకు 4 స్థానాలను కేటాయించారు. మొత్తం ఖాళీల్లో ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక సంస్థల కోటాలో 9 మంది, గవర్నర్ కోటాలో 2 ఖాళీలున్నాయి. మరి అభ్యర్థుల వివరాలు ఓ సారి చూద్దాం.
స్థానిక సంస్థల కోటాలో : 9
ఎమ్మెల్యే కోటాలో : 7
గవర్నర్ కోటాలో : 2
ఎస్సీ : 2
ఎస్టీ : 1
బీసీ : 11
ఓసి : 4
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సింహభాగం కల్పించిన వైఎస్సార్సీపీ
స్థానిక సంస్థలు :
1) నర్తు రామారావు
2) కుడిపూడి సూర్యనారాయణ
3) వంకా రవీంద్రనాథ్
4)కవురు శ్రీనివాస్
5) మెరుగ మురళి
6) డా. సిపాయి సుబ్రమణ్యం
7) రామసుబ్బారెడ్డి
8) డాక్టర్ మధుసూధన్
9) ఎస్ మంగమ్మ
ఎమ్మెల్యే కోటా :
10) పీవీవీ సూర్యనారాయణరాజు
11) పోతుల సునీత
12) కోలా గురువులు
13) బొమ్మి ఇజ్రాయెల్
14) ఏసు రత్నం
15) మర్రి రాజశేఖర్
16) జయమంగళ వెంకటరమణ
గవర్నర్ కోటా :
17) కుంబా రవిబాబు
18) కర్రి పద్మశ్రీ