తోట పవన్ ను పరామర్శించిన వైఎస్ షర్మిల

తోట పవన్ ను పరామర్శించిన వైఎస్ షర్మిల

తోట పవన్ ను పరామర్శించిన వైఎస్ షర్మిలవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ యువ నేత తోట పవన్ ను వైఎస్సార్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పరామర్శించారు. హెల్త్ కండిషన్ ను అడిగి తెలుసుకున్నారు. పవన్ కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తోట పవన్ పై జరిగిన దాడిని షర్మిల తీవ్రంగా ఖండించారు. ఇది పిరికి పంద చర్యగా అభివర్ణించారు.పవన్ కుటుంబానికి అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తోట పవన్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.