జూలైలో బిగ్ బాస్ సీజన్ 4

జూలైలో బిగ్ బాస్ సీజన్ 4

వరంగల్ టైమ్స్, హైదరాబాద్‌: క‌రోనా వైర‌స్ వినోద ప‌రిశ్ర‌మ‌పై బాగా దెబ్బ‌కొట్టింది. గ‌త రెండు నెల‌లుగా ఎంటర్‌టైన్‌మైంట్ రంగానికి సంబంధించిన అన్ని ప‌నులు ఎక్క‌డిక్క‌డ ఆగిపోయాయి. జూలై లేదా ఆగ‌స్ట్ నుండి ఈ ప‌నులు ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. అయితే క‌రోనా వ‌ల‌న బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఈ ఏడాది ఉండ‌క‌పోవ‌చ్చ‌నే టాక్  మొద‌ట వినిపించ‌గా తాజాగా స్టార్ మా ఈ షోకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.జూలైలో బిగ్ బాస్ సీజన్ 4

బిగ్ బాస్ సీజన్ 4 ప్రతి ఏడాది జూలై మొద‌టి వారంలో ప్రారంభం కానుండ‌గా, ఈ ఏడాది కూడా  అదే టైంకి ప్రారంభించాల‌ని స్టార్ మా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంద‌ట‌. ఇక ఇందులో కంటెస్టెంట్స్‌గా త‌రుణ్‌, వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్ త‌దిత‌రులు ఉంటార‌ని తెలుస్తుంది. అన్న‌పూర్ణ స్టూడియోలోనే సీజ‌న్ 4 కూడా జ‌ర‌గ‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్ ఎవ‌ర‌నే విష‌యం తెలియాల్సి ఉంది.