సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడత

సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడత

అమరావతి : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. సీఎం అయ్యాకే ఈ సభలో తిరిగి అడుగుపెడతానంటూ చంద్రబాబు నాయుడు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలకు దిగారు.

మంత్రి కొడాలి నాని, చంద్రబాబుపై తీవ్రమైన పదజాలంతో దూషించారు. మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సతీమణిని కూడా వైసీపీ నాయకులు దూషించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశాం. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశాం. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఏనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు నేను చూడలేదన్నారు.

అదేవిధంగా ఇన్నేండ్లుగా జరగని అవమానాలను భరించామని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. నిన్న కూడా సీఎం , కుప్పం ఎన్నికల తర్వాత నేను రావాలి. నా ముఖం చూడాలన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదని వెల్లడించారు.

ఈ హౌస్ లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీపరంగా విమర్శించారు. ఇన్ని యేండ్లుగా ఏ పరువు కోసం పని చేశానో, ఇన్నేండ్లుగా బతికానో , నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి అవమానించారంటూ మనస్థాపానికి గురై సీరియస్ నిర్ణయం తీసుకున్నారు సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా అని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.