స్మార్ట్ సిటీలో భాగంగా మొక్కలు నాటిన కార్పొరేటర్ వేముల

స్మార్ట్ సిటీలో భాగంగా మొక్కలు నాటిన కార్పొరేటర్ వేములహనుమకొండ జిల్లా : స్మార్ట్ సిటీలో భాగంగా నగరాల్లో పరిసరాల పరిశుభ్రతతో పాటు, ప్రకృతి రమణీయతకు నెలవులుగా ప్రజాప్రతినిధులు, అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 7వ డివిజన్ లో హనుమకొండ చౌరస్తా నుంచి హనుమాన్ టెంపుల్ వరకు ఏర్పాటు చేసిన స్మార్ట్ రోడ్డులోని డివైడర్ మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.

జంక్షన్ల సుందరీకరనలో హనుమకొండ చౌరస్తా నుంచి హనుమాన్ టెంపుల్ వరకు భాగంగా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ అధ్యక్షుడు కొండ శీను, రాజశేఖర్, గోదాస శీను, ఈశ్వర్, మోడీ , రాజు, ఆలీ, గణేష్, సారంగం, సరస్వతి , శ్రీదేవి, ఆశ, రోషిని, విజయ, పద్మ మరియు సీహెచ్ఓ సునీత, జవాన్ నవనీత టీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు పెంచడం ద్వారా నగరం సుందరంగా కనిపించడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఎంతో సహకరిస్తాయని స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా హనుమకొండ చౌరస్తా నుంచి హనుమాన్ టెంపుల్ వరకు ఏర్పాటు చేసిన స్మార్ట్ రోడ్డులో ఏర్పాటు చేసిన లైటింగ్ తో పాటు మొక్కలు నాటడం ద్వారా హనుమకొండ చౌరస్తా అందంగా కనిపిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతిని కాపాడటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.