హైదరాబాద్ : 2018 ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ పై కరీంనగర్ 3వ పట్టణ పోలీసు స్టేషన్ లో నమోదైన కేసును ఈరోజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.
పిఎస్ లిమిట్స్ లోని హుస్సేని పుర పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారని, ఎన్నికల ప్రశాంతతను దెబ్బతీశారని, గలాటాకు కారణమై స్థానికులకు ఇబ్బంది కలుగ చేశారని కేసునెంబర్ 66/2020 ద్వారా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేనందున మంత్రి గంగుల పై ఈరోజు కేసును కోర్టు కొట్టివేసింది.