పేటీఎం సీఈఓ అరెస్ట్..ఎందుకంటే ? 

పేటీఎం సీఈఓ అరెస్ట్..ఎందుకంటే ?

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మను ఢిల్లీ పోలీసులు ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. కాసేపటికే బెయిల్ పై విడుదల చేశారు. గత నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యంగా కారు నడిపి మరో వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో విజయ్ శేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం , ఫిబ్రవరి 22న తన కారులో విజయ్ శేఖర్ శర్మ ప్రయాణిస్తున్నాడు. అటుగా వస్తున్న డీసీపీ బెనితా మేరీ జైకర్ కు చెందిన కారును వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఈ ఘటన మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో జరిగింది.పేటీఎం సీఈఓ అరెస్ట్..ఎందుకంటే ? అయితే విజయ్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఆ సమయంలో డీసీపీ కారును పెట్రోల్ కొట్టించడానికి తీసుకెళ్తున్న డ్రైవర్ దీపక్ కుమర్, విజయ్ కారు నంబర్ ను నోట్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని డీసీపీకి తెలిపినట్లు సమాచారం. దర్యాప్తు జరిపిన పోలీసులు కారు గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీకి చెందినదని గుర్తించారు. అక్కడకు వెళ్లి విచారిస్తే, అది విజయ్ ది అని తేలింది. దీంతో వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే బెయిల్ ఇవ్వగలిగే సెక్షన్ల కిందే నేరం ఉండటంతో కాసేపటికే ఆయన్ని వదిలేశారు.