తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్: తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ తాజాగా విడుదలైంది. రెగ్యులర్ ఎస్ఎస్సీ, ఓపెన్ ఎస్సెస్సీ, ఒకేషనల్ రెగ్యులర్, ప్రైవేట్ ఎస్ఎస్సీ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. రెగ్యులర్ విద్యార్థులకు మే 11 నుంచి మే 17 వరకు పరీక్షలు జరుగనున్నాయి. మే 18న ఓపెన్ ఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్ ), మే 20న ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్స్ ( థియరీ) పరీక్షలు జరుగనున్నాయి.