దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభం

దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభం

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు కీలక సూచనలు చేశారు. రైలు బయల్దేరడానికి 90 నిమిషాల ముందే స్టేషన్‌కు రావాలని సూచించించారు. దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభంటికెట్లు ఉన్నవారికి మాత్రమే రైల్వే ప్రాంగణం, రైళ్లలోకి అనుమతి ఉంటుంది. ఈ రైళ్లకు రిజర్వు చేయని టికెట్లు జారీ చేయమని అధికారులు చెప్పారు. కరోనా లక్షణాలున్న ప్రయాణికులను అనుమతించమని స్పష్టం చేశారు. రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వబోమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కనీస సామాన్లతోనే ప్రయాణించాలి. అనారోగ్యంతో ఉన్న వారు ప్రయాణం చేయకపోవడమే మంచిది. గర్భిణీలు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వాళ్లు ప్రయాణించవద్దు. రైళ్లలో వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. రైల్వే ప్రాంగణాలు, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలి అని అధికారులు కోరారు.