కొత్తగూడెంలో ముందంజలో వద్దిరాజు ! 

కొత్తగూడెంలో ముందంజలో వద్దిరాజు !

కొత్తగూడెంలో ముందంజలో వద్దిరాజు ! వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : కొత్తగూడెంపై బీఆర్ఎస్ హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుకు గులాబీ టికెట్ దక్కే పరిస్థితి లేదు. వనమా రాఘవ ఇష్యూతో ఇక పెద్దాయనకు రాజకీయాల నుంచి రిటైర్మెంటేనన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం బీఫాం ఎవరికి ఇద్దామని పార్టీ పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్నారట. అందుకోసం ఇప్పటికే ఓ సర్వే కూడా చేయించినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఆ సర్వేలో ఏముందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

*రవిచంద్రకే అనుకూల వాతావరణం :
బీఆర్ఎస్ పార్టీ ఇటీవల చేయించిన సర్వేలో రెండు పేర్లు ప్రముఖంగా ఉన్నాయట. అందులో ఒకటి వద్దిరాజు రవిచంద్ర అయితే, మరొక పేరు జలగం వెంకట్రావు. ఈ రెండు పేర్లు సర్వేలో ఉన్నప్పటికీ జనం మాత్రం వద్దిరాజు రవిచంద్రకు మద్దతు పలికినట్లు సమాచారం. ఈ సర్వేలో వద్దిరాజు రవిచంద్రకు ఏకంగా 74 శాతం మంది మద్దతు పలికినట్లు టాక్. జలగం వెంకట్రావుకు కేవలం 14 శాతం ఓటేసినట్లు తెలుస్తోంది. ఈ సర్వేను బట్టి వద్దిరాజు రవిచంద్రకు కొత్తగూడెంలో పూర్తి అనుకూలంగా వాతావరణం ఉందని బీఆర్ఎస్ పెద్దలు గుర్తించారట. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ సానుకూలంగా ఉందని ప్రచారం జరుగుతోంది. సర్వే ప్రకారం కాకుండా జనంలోనూ వద్దిరాజు రవిచంద్రకు మంచి పేరుంది. కొత్తగూడెం ఏరియాలో ఆయనకు మంచి పరిచయాలున్నాయి. పార్టీల కతీతంగా నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. కొత్తగూడెంలోని అన్ని గ్రామాలపై ఆయనకు గట్టి పట్టుంది. ఇవన్నీ వద్దిరాజుకు అనుకూలంగా ఉన్నాయి.

*అప్పుడు గట్టెక్కినా..ఇప్పుడు మాత్రం కష్టమేనట !
ఇక జలగం వెంకట్రావు గురించి చూస్తే ఆయన గతంలో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆయన సొంతంగా చేసిన అభివృద్ధి ఏమీ లేదు. పైగా ఆయన 2014లో టీఆర్ఎస్ హవాలో గెలిచారు కానీ సొంత బలంతో కాదు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మతోనే గట్టెక్కారు. గెలిచిన తర్వాత కూడా ప్రజలతోనూ ఆయనకు పెద్దగా సంబంధాలు లేవు. అందుకే ఆ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. ఇవన్నీ బీఆర్ఎస్ పెద్దలు అంచనా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి వివాదాలు లేని క్లీన్ ఇమేజ్ ఉన్న వద్దిరాజుకే టికెట్ ఇస్తే మేలనే భావనలో గులాబీ పెద్దలు ఉన్నట్లు టాక్.కొత్తగూడెంలో ముందంజలో వద్దిరాజు ! *వార్ వన్ సైడేనా..
వద్దిరాజు రవిచంద్రకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే వార్ వన్ సైడ్ కావొచ్చని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. కేసీఆర్ పాలనకు తోడు వద్దిరాజు అందరితో కలిసిపోయే విధానం, ఆయన మాట తీరు, ఇవన్నీ కొత్తగూడెం ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయట. అందుకే గులాబీ నేతలు, ప్రజాప్రతినిధులు, పక్క నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా వద్దిరాజుకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే బీఆర్ఎస్ హైకమాండ్ దగ్గర ప్రతిపాదించినట్లు సమాచారం. ఇవన్నీ చూస్తుంటే వద్దిరాజు రవిచంద్రకు గులాబీ టికెట్ రావడం ఖాయమేనని ప్రచారం జరుగుతోంది.

*ఆయనను ఢీకొట్టాలంటే వద్దిరాజే కరెక్ట్ అంట !
ఇక అన్నింటికి మించి కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగుతారన్న వాదన ఉంది. కాబట్టి పొంగులేటిని ఢీకొట్టాలంటే అన్నిరకాలుగానూ బలీయంగా ఉన్న వద్దిరాజు రవిచంద్రతోనే సాధ్యమని బీఆర్ఎస్ హైకమాండ్ కూడా భావిస్తోందట. అందుకే వద్దిరాజుకు కొత్తగూడెంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, బీఫాం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని టాక్. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా వద్దిరాజుకు టికెట్ పై గట్టి హామీయే ఇచ్చినట్లు సమాచారం. ఆ దిశగా వద్దిరాజుకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే వద్దిరాజు కూడా కొత్తగూడెంలో కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే ఆయనపై జనంలో పాజిటివ్ ఒపినియన్ ఉన్న నేపథ్యంలో టికెట్ రావడమే ఆలస్యం. బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర గెలుపు లాంఛనమేనని గులాబీ శ్రేణులు కూడా స్పష్టం చేస్తున్నారు. విశ్లేషకులు కూడా వద్దిరాజుకే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అంతలా కొత్తగూడెంలో వద్దిరాజు రవిచంద్ర పేరు మార్మోగుతుంది!