అలర్ట్ భారీగా పెరుగనున్న ఉష్ణోగ్రతలు

అలర్ట్ భారీగా పెరుగనున్న ఉష్ణోగ్రతలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD)తెలిపింది. రానున్న 10 రోజులు కోస్తాంధ్ర సహా తెలంగాణలోని ఉత్తర, తూర్పు భాగాల్లో ఎండతీవ్రత బాగా పెరిగే అకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ప్రస్తుతం 35-36 డిగ్రీల మధ్య ఉన్న ఉష్ణోగ్రతలు, త్వరలోనే 38-39 డిగ్రీలకు పెరుగుతాయని తెలిపింది. పలు చోట్ల 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.అలర్ట్ భారీగా పెరుగనున్న ఉష్ణోగ్రతలువేసవి కాలంలో వడదెబ్బ తగలడం, డీహైడ్రేషన్ కు గురికావడం లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరించింది. ఎండా కాలంలో వీలైనంత వరకు ఇంటిపట్టునే ఉండటం మంచిదని సూచించింది. ముఖ్యమైన పనులు ఉంటే ఉదయం 10 గంటలలోపే పూర్తి చేసుకోవాలని తెలిపింది. లేదా సాయంత్రం ఆరు దాటిన తర్వాత బయటకు వెళ్లడం మంచిదని ఐఎండీ శాఖ వెల్లడించింది. ఎండా కాలంలో నీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మంచిదని సూచించింది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదని, ఏదైనా ఇబ్బందులు తల్తెతితే డాక్టర్ ను సంప్రదించాలని తెల్పింది. వేసవిలో మజ్జిగ, బార్లీ, కొబ్బరి నీరు తీసుకోవడం ఉత్తమమని పేర్కొంది.