ఫిరంగి పేలి బీఎస్ఎఫ్ జవాన్ మృతి

జైసల్మేర్ : రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఫిరంగులు పేల్చడంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్న ఓ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ ప్రమాదవశాత్తు ఫిరంగి పేలి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

బీఎస్ఎఫ్ లోని 136 బెటాలియన్ కు చెందిన జవాన్ లు ఆదివారం ఉదయం జైసల్మేర్ ఫిరంగులు పేల్చడంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఓ ఫిరంగి పేలి ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జవాన్ ను చికిత్స కోసం రామ్ గఢ్ ఆస్పత్రికి తరలించే క్రమంలో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన జవాన్ పేరు సందీప్ సింగ్ అని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు, బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.